Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి – రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతి బుధవారం రాకపోకలు సాగిస్తుందని చెప్పింది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Read Also : “Vande Bharat Sleeper | ఈ రూట్లోనే తొలిసారి కూతపెట్టనున్న వందే భారత్ స్లీపర్..!”
రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజీ, మయిలదుతురై, తిరువూర్, తిరుతురైపూండి, అదిరంపట్టణం, పుదుకొట్టై, అర్ణతాంగి, కారైకుడి, శివగంగ, మానమాదురై స్టేషన్లలో రైలు ఆగుతుందని పేర్కొంది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయని వివరించింది.