Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని వందే భారత్‌లో స్లీపర్ వెర్షన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో స్లీపర్ రైళ్లను తీసుకువస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైలు ట్రయల్స్ నిర్వహించింది. దేశంలోనే తొలి స్లీపర్ వందే భారత్ స్లీపర్ రైలును యూపీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. రైలు రూట్‌ని సైతం ఖరారు చేసిందని.. త్వరలోనూ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
యూపీలోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబయికి ఈ రైలును నడపాలని రైల్వేశాఖ నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. వందే భారత్ తొలి రైలును వారణాసి-ఢిల్లీ మధ్య ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఢిల్లీ కోచ్ యార్డ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే, లక్నో-ముంబయి మార్గంలో భారీగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే ఈ మార్గంలోనే తొలి స్లీపర్ రైలును నడిపే అవకాశాలున్నాయి. రైల్వేశాఖ సర్వేను సైతం పూర్తి చేసినట్లు సమాచారం. తేజస్ తరహాలోనే ఈ రైలు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉండనున్నది. ఈ రైట్‌కు రైల్వేబోర్డు ఆమోదం ఇవ్వాల్సి ఉంది. బోర్డు నుంచి అనుమతి పొందిన తర్వాత రైలు రూట్, షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే.. జులై నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ మార్గంలో సర్వే ఆరు నెలలుగా జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
గతంలో కాన్పూర్, మధుర, ఆగ్రా మీదుగా ముంబయికి నడపాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత బరేలీ నుంచి ఆగ్రాకు ఆవోన్లా, చందౌసి, మొరాబాద్, ఘజియాబాద్, నిజాముద్దీన్ మీదుగా ముంబయికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. చివరకు బరేలీ జంక్షన్ మీదుగా ముంబయి రూట్‌ను నిర్ణయించగా.. తాజాగా లక్నో నుంచి హర్దోయ్, షాజహాన్‌పూర్, బరేలీ జంక్షన్, రాంపూర్, మొరాదాబాద్, ఘజియాబాద్, నిజాముద్దీన్, ఆగ్రా మీదుగా బయలుదేర నున్నది. ఈ మార్గం యూపీతో పాటు ఉత్తర భారతంలోని పలు జిల్లాల నుంచి ముంబయికి ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 20 కోచ్‌లు ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు రెండు జనరల్ AC ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ కాకుండా, రెండు సీటింగ్ కం లగేజీ కోచ్‌లు సైతం ఉంటాయి.
రైలులో దాదాపు 1200 మందికి ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చు. ఈ రైలు వారానికి నాలుగు రోజులు నడువనున్నది. ప్రస్తుతం లక్నో-ముంబయి మధ్య రైలు ప్రయాణానికి 16 నుంచి 17 గంటల సమయం పడుతుంది. స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు పది గంటల్లోనే ప్రయాణికులు గమ్యస్థానం చేరే వీలుంటుంది. ఇదిలా ఉండగా.. వందే భారత్ స్లీపర్ రైలును దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య నడిపేందుకు రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి. న్యూఢిల్లీ-సికింద్రాబాద్, న్యూఢిల్లీ-హౌరా, ఢిల్లీ-పుణే, ముంబయి-ఢిల్లీ నగరాలను కలుపుతూ రైలును నడుపనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లక్నో-ముంబయి రూట్ మధ్య రైలు ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో ఏ మార్గంలో స్లీపర్ వెర్షన్‌ను నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదిస్తుందో వేచి చూడాల్సిందే.
Read Also :
“Swarail App | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో సూపర్‌యాప్..!”