నల్లగొండ : నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిమడమూరుకు చెందిన రావిరాల సాయమ్మ(65)కు కొడుకు శివ(36) ఉన్నాడు.
ఏడాది క్రితం శివకు వివాహం జరిగింది. కాగా, శివ భార్య ఇటీవలే విడాకులు తీసుకుంది. ఏమైందో తెలియదు కాని శివ తన తల్లిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తాను గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే శివ మానసిక స్థితి సరిగా లేదని బంధువులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే తల్లి, కొడుకు మృతి చెందడం నిమనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.