హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని సమస్యల ను పరిష్కరించాలని గురుకుల సంఘా ల జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి సోమవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
గురుకులాలకు శాశ్వత భవనాలను ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రస్తుతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో గురుకుల పనివేళలను తక్షణం మార్చాలని కోరారు. జేఏసీ నేతలు నర్సింహులు గౌడ్, గణేశ్, భిక్షం యాదవ్, వేదాంతచారి తదితరులు పాల్గొన్నారు.