బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 14:07:05

రోడ్డు ప్ర‌మాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్‌: న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడెంలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మ‌ర‌ణం చెందాడు. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా నరేంద్ర (30) హైద‌రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, స్వగ్రామంలో ఉన్న తన కూతురు మొద‌టి జన్మదిన వేడుకల కోసం మూడు రోజుల క్రితం‌ హైదరాబాద్‌ నుంచి బైక్‌పై వచ్చాడు. సోమ‌వారం కూతురు పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించి మంగళవారం ఉద‌యం హైద‌రాబాద్‌కు తిరుగు ప‌య‌న‌మ‌య్యాడు. మార్గమధ్యంలో మిర్యాలగూడెం జాతీయరహదారిపై ప్రమాదశాత్తు బైక్ అదుపుత‌ప్పి ప‌డ‌టంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో న‌రేంద్ర అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. విష‌యం తెలిసిన వెంట‌నే మృతుడి కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo