e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home News హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్

హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్

హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్

న్యూఢిల్లీ: సొంతింటి క‌ల నిజం చేసుకోవాల‌ని మీరు భావిస్తున్నారా. త‌క్కువ వ‌డ్డీరేటుకే ప‌లు ప్రైవేట్ బ్యాంకులు మీకు ఇంటి రుణాలివ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఇంటి రుణం తీసుకునే వారు వ‌డ్డీరేటుతోపాటు బ్యాంక‌ర్ల‌కు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని టాప్‌-10 ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న ఇంటి రుణాలు.. వాటిపై వ‌డ్డీరేట్ల అమ‌లు ప్ల‌స్ ప్రాసెసింగ్ ఫీజు తెలుసుకుందామా!

6.70% వ‌డ్డీరేటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫ‌ర్

హెచ్డీఎఫ్సీ బ్యాంకు దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక‌టి. ఇది త‌మ ఖాతాదారుల‌కు 6.70% వ‌డ్డీరేటుపై ఇంటి రుణం అందిస్తోంది. అయితే, మీరు ఇంటి రుణం తీసుకుంటే నెల‌వారీగా రూ. ల‌క్ష‌కు రూ.646 వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లోన్ ప్రాసెసింగ్ కోసం మీరు రూ.3000 చెల్లించాల్సిందే.

రుణంలో 0.50/2% ప్రాసెసింగ్ ఫీజు

మ‌రో టాప్ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటి కొనుగోలుదారుల‌కు 6.70%పై ఇంటి రుణం ఆఫ‌ర్ చేస్తున్న‌ది. ఈఎంఐగారూ.646 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, న‌గ‌రాల వారీగా ఇంటి రుణంలో 0.50-2% అధికంగా గానీ, రూ.1500 గానీ ఏది ఎక్కువ ఉంటే అది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఒక‌వేళ మీరు ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే రూ.2000 (0.50-2%) చెల్లించాలి.

కోట‌క్ మ‌హీంద్రా ఈఎంఐ రూ.648

ప్ర‌ముఖ దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ 6.75 శాతం వ‌డ్డీరేటుపై ఇంటి రుణాలిస్తున్న‌ది. నెల‌కు ప్ర‌తి ల‌క్ష‌పై రూ.648 వాయిదా చెల్లింపులు చేప‌ట్టాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శకాల‌కు లోబ‌డి మొత్తం రుణంలో ప్రాసెసింగ్ ఫీజుగా 0.50 శాతం చెల్లించ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

యాక్సిస్ బ్యాంక్ నుంచి లోన్ ఇలా

సొంతింటి క‌ల సాకారం చేసుకోవాల‌ని భావించే వారికి యాక్సిస్ బ్యాంకు ఇచ్చే రుణాల‌పై 6.90 శాతం వ‌డ్డీ వ‌సూలు ఏస్తున్న‌ది అయితే, రుణ గ్ర‌హీత ప్ర‌తి ల‌క్ష‌కు రూ.659 చొప్పున చెల్లించాలి. ప్రాసిసింగ్ ఫీజుగా క‌నీసంగా రూ.10 వేల‌తోపాటు మొత్తం రుణంలో ఒక‌శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిందే.

స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంకులో 7.90% వ‌డ్డీరేటు

స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంక్ మంజూరు చేసే ఇంటి రుణాల‌పై మొత్తం రుణంలో 0.50 లేదా ఒక‌శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. ప్ర‌తి నెలా క‌నీస ఈఎంఐ రూ.733గా చెల్లించాలి. దీని ప్ర‌కారం ఖాతాదారు నుంచి స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంకు 7.90 శాతం వ‌డ్డీ రేటు వ‌సూలు చేస్తుంది.

యెస్‌బ్యాంకులో ఈఎంఐగా రూ.801

ఇక మ‌రో ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ 8.95 శాతం వ‌డ్డీపై ఇంటి రుణం అందిస్తుంది. నెల‌వారీగా రూ.ల‌క్ష‌కు రూ.801 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

అంబానీలపై 25 కోట్ల ఫైన్‌

ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్‌

స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్‌ రిగ్గులు

పసిడి పరుగు

భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా

ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల కోసం పీఎల్‌ఐ పథకం

బజాజ్‌ అలియాంజ్‌ సరికొత్త బీమా

మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్‌ డీల్

దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!

Advertisement
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement