Womens T20 World Cup | సీనియర్లకే మరో ఛాన్స్.. ఇద్దరు పేసర్లతో ప్రపంచకప్ స్క్వాడ్..!
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నందున బంగ్లాదేశ్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. నిగర్ సుల్తానా (Nigar Sultana) కెప్టెన్‌గా పదిహేను మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నందున బంగ్లాదేశ్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. నిగర్ సుల్తానా (Nigar Sultana) కెప్టెన్‌గా పదిహేను మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. గత ఎడిషన్ స్క్వాడ్‌లోని 11 మందికి మళ్లీ చోటు దక్కగా.. సీనియర్ షర్మీన్ సుల్తానా స్థానంలో టాపార్డర్ బ్యాటర్ తేజ్ నెహర్కు సెలెక్టర్లు అవకాశమ ఇచ్చారు. అయితే.. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ ఐసీసీ ఈవెంట్లో ఇద్దరు పేసర్లతోనే బంగ్లా జట్టు ఆడనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ప్రపంచకప్ పండుగకు బంగ్లాదేశ్ మహిళల జట్టు సిద్ధమవుతోంది. స్క్వాడ్ ఎంపిక అనంతరం చీఫ్ సెలెక్టర్ సజాద్ అహ్మద్ మాట్లాడుతూ ఇద్దరు పేసర్లను మాత్రమే తీసుకోవడంపై వివరణ ఇచ్చాడు. ‘బంగ్లాదేశ్ బృందంలో ఇద్దరు పేసర్లు ఉండడానికి కారణం పేసర్లు త్వరగా గాయపడుతారు. పైగా ఇంగ్లండ్‌లో వికెట్ ఒకప్పటిలా పేస్‌కు కాకుండా ఉపఖండం మాదిరిగా ఉంటుందని తెలిసింది. అంటే.. స్పిన్నర్లకు అనుకూలిస్తాయి.
Bangladesh have named their squad for the upcoming T20 World Cup; Nigar Sultana will lead the side for a third consecutive campaign https://t.co/zE4GqDbIKV pic.twitter.com/IoZJ9gtYu4
— ESPNcricinfo (@ESPNcricinfo) May 10, 2026
సో.. అందుకే స్పిన్నర్లపై నమ్మకం ఉంచాం. వన్డేల్లో రాణిస్తున్న షర్మీన్ సుల్తానా బదులు తేజ్ నెహర్ను ఎంపిక చేయడానికి కారణముంది. నెహర్ వైవిధ్యమైన ప్లేయర్. ఆమె ఓపెనింగ్ నుంచి ఆరో స్థానంలో ఎక్కడైనా ఆడగల సమర్ధురాలు. డెత్ ఓవర్లలో తను గొప్పగా ఆడగలదు’ అని సజాద్ వెల్లడించాడు. అంతేకాదు ఫార్మాట్‌కు తగ్గట్టుగా దూకుడైన ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాడు.
‘బంగ్లాదేశ్ జట్టు డిఫెన్స్ స్టయిల్ బ్యాటింగ్ అతిపెద్ద సమస్యగా మారింది. ఒక్కరాత్రిలోనే అంతా మారిపోతుందని నేను చెప్పను. కానీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు’ అని సజాద్ తెలిపాడు. టాపార్డర్‌లో నిగర్ సుల్తానా, షర్మీన్ అక్తర్, శోభనా మొస్త్రే, తేజ్ నెహర్ కీలకం కానున్నారు. నిరుడు భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో మెరిసిన యువ పేసర్ మరుఫా అక్తర్‌తో పాటు ఫరిహా ఇస్లాం కొత్త బంతిని పంచుకోనుంది. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా నెదర్లాండ్స్, స్కాట్లాండ్తో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్12 నుంచి పొట్టి ప్రపంచకప్ మొదలవ్వనుంది.
బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్ : నిగర్ సుల్తానా జోటీ(కెప్టెన్), నహిదా అక్తర్(వైస్ కెప్టెన్), షర్మీన్ అక్తర్, శోభనా మొస్త్రే, షోర్నా అక్తర్, రీతు మోని, రబేయ ఖాన్, పాహిమా ఖాతూన్, ఫరీహ ఇస్లాం, మరుఫా అక్తర్, షాంజిద అక్తర్, సుల్తానా ఖాతున్, దిలరా అక్తర్, జుయైరియా ఫిర్దౌస్, తాజ్ నెహర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

