పసిడి పరుగు

- తులంపై రూ.590 పెరుగుదల
- రూ.690 అధికమైన కిలో వెండి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 7: క్రమంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం బుధవారం మరింత పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.590 పెరిగి రూ.45,770 పలికింది. అంతకుముందు ధర రూ.45,180గా ఉన్నది. పసిడితోపాటు వెండి మరింత పుంజుకున్నది. కిలో వెండి ధర రూ.690 అధికమై రూ.65,470గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి రూ.46,530 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.42,650గా ఉన్నది. వెండి ఏకంగా రూ.1,200 అధికమై రూ.70,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా త్వరలో పెళ్ళిళ్ళ సీజన్ కూడా ప్రారంభంకాబోతుండటంతో అమాంతంగా డిమాండ్ ఊపందుకున్నది. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ఉగాది పండుగ తర్వాత తిరిగి పెళ్ళిళ్ళకు మంచి ముహుర్తాలు ఉండటంతో దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Gold Price
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

