కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఒక పట్టాన వదలడం లేదు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ అన్ని దేశాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్యకు భయపడని చాలా మంది మనుషులు.. ఇప్పుడు కరోనా పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు గురైన వారిలో వృద్ధులు ఎందరో చనిపోయారు కూడా. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఎందరో ముందుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెకండ్ డోసు వేసుకున్న ఓ సిక్కు వ్యక్తి గురుదీప్ పంథేర్ స్వయంగా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ కావడంతో.. తన ఆనందాన్ని డాన్స్ చేసి వ్యక్తపరిచాడు. కెనడాలోని మంచుతో కప్పి ఉన్న మంచు కొలనుపై బాంగ్రా డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని పది మందికి చాటారాయన.
నెలరోజుల తర్వాత గురువారం నాడు సెకండ్ డోస్ తీసుకున్నందున ఇక తాను కరోనాకు భయపడేది లేదని చెప్తున్నాడు. అయితే, ఇదే సమయంలో ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని, అలాగే, ప్రభుత్వ కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కెనడా నుంచి కోరుకుంటున్నానని రాశారు.
మంచు గడ్డకట్టిన సరస్సుపై గురుదీప్ పంథేర్ చేస్తున్న బాంగ్రా డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 20 వేల మంది లైక్ కొట్టారు.
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
ట్రైనీ ఎయిర్‌హోస్టెస్‌కు ఇంటర్ విద్యార్థి వేధిపులు.. ఐదు గంటల్లోనే పట్టివేత
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
భారత్‌పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్ బిపిన్ రావత్
రేపు భారత్, చైనా మధ్య 11 వ రౌండ్ చర్చలు
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..