జగిత్యాల : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు(Social philosopher)మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి(Birth anniversary) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు.
అంటరానితనం, బాల్య వివాహాల(Child marrage) కు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు(Womens) చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందన్నారు.
బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ బీసీ కుల సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దావ వసంత సురేశ్, అదనపు కలెక్టర్ మకరందు, లైబ్రరీ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.