వరంగల్ : పాము అంటే అందరికి భయమే. ముఖ్యంగా రాత్రివేళల్లో నాగుపాము ఇంట్లో చొరబడడమే కాకుండా తెల్లవారుజాము వరకు ఆ కుటుంబ సభ్యులు పాము కోసం కంటికి కునుకు లేకుండా గడిపారు .
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని రెండో వార్డులో ఓ ఇంట్లో నాగుపాము కలకలం రేపింది. ఇంట్లో దూరిన పాము ఏకంగా ఇత్తడి బిందెలో దూరింది. దీంతో భయాందోళనకు గురైన ఇంటి కుటుంబ సభ్యులు అప్రమత్తమై బిందె పై బండను పెట్టి దానిని కదలకుండా చేశారు.
శనివారం ఉదయం బిందెతో సహా దానిని రోడ్డుపైకి తీసుకువచ్చి పాములు పట్టే అతన్ని పిలిపించి అప్పగించారు. పాములను పట్టే అతను చాకచక్యంగా నాగుపామును పట్టుకొని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలివేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.