Urea | రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండా రోజంతా లైన్లలో నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకకపోవడంతో ఉసూరుమంటూ రిక్తహస్తాలతో ఇంటిబాటపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. అవసరాలకు తగినంత యూరియాను అందుబాటులో ఉంచడంతో విఫలమవుతున్నది.
సూర్యాపేట జిల్లా..
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం బారులు తిరిన రైతన్నలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం తరలివచ్చిన రైతులు, మహిళ రైతులు.
నారాయణపేట జిల్లా మరికల్లో యూరియా కోసం క్యూలైన్లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉంచిన రైతులు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా గురించి రైతుల ఇబ్బందులు.
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులు.
మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి సమీపంలోని హాకా రైతు సేవా కేంద్రం వద్ద క్యూలైన్లో చెప్పులు ఉంచి సేదతీరుతున్న అన్నదాతలు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగురు సొసైటీ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు.. చెప్పులు లైన్లో పెట్టి ఎదురుచూస్తున్న రైతులు.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలో ఏంసన్పపల్లి గ్రామంలో యూరియా గురించి రైతు వేదిక ముందు క్యూలైన్లు.