ఆదిలాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు బుధవారం వినూ త్న నిరసన చేపట్టారు. అమలుకాని పథకాల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను తయా రు చేసి తమ ఇండ్లలో పెట్టుకున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రెండు పంటలకు ఎగ్గొట్టిన రైతుభరోసా, రూ.4వేల పింఛన్లు, విద్యార్థినులకు స్కూటీలు, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ. 2500 తదితర హామీలతో కూడిన ఫ్లెక్సీలను ఇంటింటా పెట్టుకుని నిరసన తెలిపారు.
ఫ్లెక్సీలతో ప్రభుత్వాన్ని నిలదీసిన గ్రామస్థులను మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, మాజీ ఎంపీటీసీ సుభాశ్ అభినందించారు. గ్రామస్థుల నిరసనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో కొనియాడారు. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతున్నారని ప్రశంసించారు.