వరంగల్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని, రేవంత్ పాలనలో ఈ రెండు జరుగుతున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అత్యంత నీచంగా పాలనసాగిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణలో అధికంగా భూగర్భ జలాలు తగ్గాయి.
కేసీఆర్ హయాంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికల ముందు యూరియా కొరత, రైతుల చెప్పుల క్యూ ఉంటుంది అని చెప్పారు. నేడు అదే జరుగుతోందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటల కొనుగోళ్లు లేవు. సాగు నీటి, తాగు నీరు ఎద్దడి ఏర్పడిందన్నారు. హామీలు అమలు, పాలనను గాలికి వొదిలేశారన్నారు.
నాటి కేసీఆర్ పాలనను, నేటి కాంగ్రెస్ పాలనను పోల్చి చూడండి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మే 6న వరంగల్ వేదికగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించింది. కానీ డిక్లరేషన్ అమలు మరిచింది. అందుకే వారి నిర్లక్ష్యాన్ని ఎండగట్టి రైతుల కోసం పోరాడేందుకే రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు దయాకర్ రావు, రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్ తాటికొండ రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మా రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్ రావు, హరి రమా దేవి, పులి రజినీకాంత్, నాయిముద్దీన్, రాజ్ కిషోర్, జానకిరాములు, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు