హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతగాక ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై, కేటీఆర్ బావమరిదిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను ఎదుర్కొలేకే నీచ రాజకీయాలకు దిగిందని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.