పుల్కల్, అక్టోబర్ 6 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు(Singuru project) ఇన్‌ఫ్లో(Inflow) కొనసాగుతున్నది. ఆదివారం 6,11 నంబర్ రెండు గేట్లు 1.50 మీటర్లు ఎత్తి(Lifting gates) 11,0 26 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కో కోసం 2,796 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆదివారం 13,076 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, 14,453 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 29.708 టీఎంసీలు నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.