పనాజీ: బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. (Tensions in Goa) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ గోవాలో కూడా స్థానికులు, రాజకీయ నేతలు నిరసనకు దిగారు. దక్షిణ గోవాలోని మార్గోవ్ నగరంలో ర్యాలీ నిర్వహించారు. శనివారం అర్థరాత్రి వేళ మార్గోవ్లోని జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. అలాగే పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజలు శాంతి వహించాలని, సంయమనం పాటించాలని గోవా చర్చి అధికారులు పిలుపునిచ్చారు.
కాగా, ఓల్డ్ గోవాలోని చర్చికి సంబంధించిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ను విమర్శించిన ఆర్ఎస్ఎస్ గోవా మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్పై 12కుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదు. శనివారం స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వెలింగ్కర్ దాఖలు చేశారు. అయితే అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు గోవా పరిణామాలపై కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ స్పందించారు. బీజేపీ పాలనలోని గోవాలో మత సామరస్యంపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు.
Goa’s appeal lies in its natural beauty and the warmth and hospitality of its diverse and harmonious people.
Unfortunately, under BJP rule, this harmony is under attack. The BJP is deliberately stoking communal tensions, with a former RSS leader provoking Christians and Sangh…
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2024