AP politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రాజకీయాల్లో నెంబర్ వన్ అని వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బాబు తన అవసరాలకు తగినట్టుగా వేషాలు మారుస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మనోగతం అంటూ ట్విటర్ వేదికగా ఆయన సెటైరికల్ కామెంట్స్ చేశారు.
‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం..! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది. తదుపరి (Next).. అర్జంట్‌గా బైబిల్ కావాలి ఎక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్..?. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి.. ఊసరవెల్లి రాజకీయాలు’ అంటూ విమర్శలు చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం!
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి.
పవిత్ర దసరా అయిపోవస్తుంది …..
తదుపరి (Next)…….
అర్జంట్ గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్……. పవిత్ర క్రిస్మస్ వస్తుంది గా వేషం మార్చాలి…..ఊసరవెల్లి రాజకీయాలు.@ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 6, 2024