HYD Rains | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేటలో వర్షం రికార్డయ్యింది. మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, ప్రగతినగర్, గండిమైసమ్మ, గాగిల్లాపూర్‌లో వర్షం కురిసింది. ప్యారడైజ్, చిలుకలగూడ, వారాసిగూడతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై వర్షం నీరు నిల్వడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశాలున్నాయని చెప్పింది. గరిష్ఠంగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య ఉంటాయని పేర్కొంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పింది.