INDW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు పంజా విసురుతున్నారు. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ బ్యాటర్లను వణికిస్తున్నారు. తొలి ఓవర్లోనే పేసర్ రేణుకా సింగ్ ఓపెనర్ గుల్ ఫిరోజ్ (0)ను బౌల్డ్ చేసింది. ఆ తర్వాత అరుంధతీ రెడ్డి, దీప్తి శర్మ కూడా వికెట్ల వేట కొనసాగించడంతో పవర్ ప్లేలోనే పాక్ టాపార్డర్ కుప్పకూలింది.
33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాక్‌ను మిడిలార్డర్ ఆదుకునే ప్రత్నం చేసింది. కానీ, శ్రేయాంక పాటిల్ తన మొదటి ఓవర్లోనే డేంజరస్ మునీబా అలీ(17)ని బోల్తా కొట్టించి పాక్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం మాజీ కెప్టెన్ నిదా దార్(6), అలియా రియాజ్(0)లు ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 41/4.
Deceived and how! 😎
Shreyanka Patil 🤝 Richa Ghosh
Pakistan 4⃣ down.
📸: ICC
Follow the match ▶️ https://t.co/eqdkvWVK4h#TeamIndia | #T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/fFTKBZgQe9
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
టాస్ గెలిచిన పాకిస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. స్పీడ్‌స్టర్ రేణుకా సింగ్ ఆఖరి బంతికి గుల్ ఫిరోజ్(0)ను డకౌట్ చేసింది. అక్కడితో పాక్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ సైతం చెలరేగగా పాకిస్థాన్ 33 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. దాంతో.. భారీ స్కోర్ కొట్టి టీమిండియాను ఒత్తిడిలో పడేయాలనుకున్న పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.