హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ: తన తప్పులకు కాంగ్రెస్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం లో కేసీఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ నోటీసులు ఇవ్వడం, విచారించడం.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టున్నదని విమర్శించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు అమలు నుంచి తప్పించుకోవడానికి తప్పుడు కేసులతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నదని ఆయన ఆక్షేపించారు.