Singireddy Niranjan Reddy | రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా.. హరీశ్‌రావు హౌస్ అరెస్టుపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్
Singireddy Niranjan Reddy | పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్‌రావు గృహ నిర్బంధం అక్రమమని మండిపడ్డారు.
Singireddy Niranjan Reddy | పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్‌రావు గృహ నిర్బంధం అక్రమమని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే ఈ సర్కార్‌కు భయమెందుకు అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా నిలదీశారు.
అధికారం చేతిలో ఉందని ఈ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూముల చెరబడుతున్నదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు .. ఒక్క ఇటుక పేర్చింది లేదని విమర్శించారు. కానీ భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం సిగ్గు చేటు అని విమర్శించారు.
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు .. కాంగ్రెస్ నేతలు భూములను దోచుకుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా ప్రజలు, రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగింత
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు
హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్… https://t.co/ApC9XTf21H pic.twitter.com/3ANmabd84T
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

