తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించడం, కొత్త జిల్లాలు ఏర్పడటం వల్లే నారాయణపేటకు మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అభ్యసించే అవకాశం దక్కింది. రేవంత్ సమక్షంలోనే మెడికల్ విద్యార్థిని సత్యజ్యోతి ఈ విషయం స్పష్టం చేశారు. కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి అభివృద్ధిపై చర్చించాలనడం విడ్డూరం. ఆ చర్చకు నారాయణపేటలోని మెడికల్ కళాశాల, జిల్లా దవాఖాన, కొత్త పోలీస్స్టేషన్లు, విద్యార్థిని సత్యజ్యోతే సమాధానం.
– నిరంజన్రెడ్డింత్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వక్రీకరణలతో చరిత్రను దాచలేరని, సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే అబద్ధాలు చెప్పినా వాస్తవాలు మిగిలే ఉంటాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిజాలు ప్రజల అనుభవంలో ఉంటాయని, అబద్ధాలు మాట్లాడినవారిని ప్రజలు ఏవగించుకుంటారని పేర్కొన్నారు.ఎకడికి వెళ్లినా ఏమీ చేయకపోగా కేసీఆర్ పదేండ్ల పాలనపై విషం చిమ్ముతున్నారని సీఎం వస్తే తమకు మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తారని, కానీ రేవకేసీఆర్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు శుభప్రద్‌పటేల్, రంగినేని అభిలాశ్, హనుమంతు నాయుడుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
‘కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లా నారాయణపేటకే శుక్రవారం రేవంత్ వెళ్లారు. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన కొత్త మెడికల్ కళాశాలను సందర్శించారు. కేసీఆర్ నిర్మించిన జిల్లా దవాఖానను ప్రారంభించారు. రెండు పోలీస్స్టేషన్లను కూడా ప్రారంభించారు. అవి కూడా కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయి. 10 నెలలుగా వినియోగంలో ఉన్న ధన్వాడ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. ఉమ్మడి పాలమూరును కేసీఆర్ ఐదు జిల్లాలుగా చేసినందుకే ఐదు మెడికల్ కళాశాలలు, దవాఖానలు వచ్చాయి. తద్వారా వేల మంది పిల్లలకు ఎంబీబీఎస్ చదువుకొనే అవకాశం వచ్చింది. కేసీఆర్ ఎంతో చేసిన జిల్లాకు వెళ్లి అభివృద్ధిపై చర్చిద్దామని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం’ అని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు పదేండ్ల్ల కేసీఆర్ పాలనలో అసలు నీళ్లే ఇవ్వలేదని రేవంత్ చెప్తున్నారని, మరి వానకాలంలో 12 లక్షల ఎకరాలు, ఇప్పుడు 6 లక్షల ఎకరాల్లో పంటలు ఎలా సాగవుతున్నాయని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక పాలమూరు జిల్లాలో కొత్తగా ఒక ఎకరాకైనా సాగునీరు ఇచ్చారా? అని రేవంత్‌ను నిలదీశారు. ‘కేసీఆర ప్రారంభించిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు, ఇక్కడి కాంగ్రెస్ నేతలు అనేక అవరోధాలు సృష్టించారు. అయినా వాటన్నింటిని అధిగమించి రూ.34 వేల కోట్లు ఖర్చు చేసి, 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేశారు. మూణ్నాలుగు నెలలు సీరియస్‌గా పనిచేసి రూ.1000- 1200 కోట్లు ఖర్చు చేస్తే 12.50 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి.
ఈ 14 నెలల నుంచి పాలమూరు బిడ్డ ఎకడికి పోయిండు? 90 శాతం అయిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదు? రేవంత్ స్థానంలో ఎవరున్నా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే దీనిపై దృష్టిసారించేవారు. రైతులు పంటలు వేయొద్దని, బోర్లు వేయొద్దని చెప్పడానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కావాలా? రైతుబంధు ఎందుకు రాలేదో, రుణమాఫీ ఎందుకు కాలేదో కమిషన్ చెప్పాలి. తెలంగాణ అన్యాయాల మీద మొదటి నుంచి పోరాడుతున్నది బీఆర్ఎస్.. మొదటి నుంచి ద్రోహం చేసింది కాంగ్రెస్, టీడీపీ. నిరంతర నిందాపూర్వక ఆరోపణలతో తెలంగాణకు గాని, రేవంత్‌కు గాని ఎలాంటి మేలు జరగదు’ అని మండిపడ్డారు.
నేను పాలమూరు బిడ్డను నన్ను కాపాడుకోవాలని అంటున్నావు. దేనికి కాపాడుకోవాలి రేవంత్‌రెడ్డి నిన్ను? రుణమాఫీ చేయనందుకా? రైతుభరోసా ఇవ్వనందుకా? నీళ్లు ఇవ్వక, కరెంటు ఇవ్వక పంటలు ఎండబెట్టినందుకా?
– నిరంజన్‌రెడ్డి