వనపర్తి టౌన్, ఫిబ్రవరి 7 : బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో నిర్మాణాలు చేపడితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎన్నో విధ్వంసాలు చేసిందని విమర్శించారు. శనివారం వనపర్తి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అనేక అబద్ధాలు చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్ర జలను మోసగించారని మండిపడ్డారు. రెం డేండ్లలో ఒక్క అభివృద్ధి పని చేయని ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.