హైదరాబాద్,ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్ అసలు బుద్ధి మారలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చే యడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పచ్చి బూతులు, పిచ్చికూతలతో కేసీఆర్ చరిత్రను చెరపలేరని, రేవంత్‌రెడ్డి ఎంత ఎగిరెగిరిప డ్డా.. ఆ మహానేత ప్రతిష్ఠను తగ్గించలేరని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన అబద్ధాలను ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. వచ్చేది కేసీఆర్ సర్కారేనని, అందుకే రేవంత్ అసహనంతో అవాకులు చెవాకులు పేలుతున్నాడని తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరిట బడుల మూసివేతకు పూనుకోవడం సిగ్గుచేటని ఎస్టీయూ టీఎస్ పూర్వ అధ్యక్షుడు భుజంగరావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ 20 లక్షల నుంచి 17 లక్షలకు పడిపోయిందని, ఇది రేవంత్‌రెడ్డి సర్కార్ దివాలాకోరు తనానికి నిదర్శనమని బుధవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. జీరో ఎన్రోల్మెంట్ పేరిట ఇప్పటికే 2 వేలకుపైగా బడులను మూసివేశారని, ఇప్పుడు మళ్లీ రేషనలైజేషన్ పేరుతో మరికొన్ని స్కూళ్లను మూసివేయబోతున్నారని మండిపడ్డారు.