ఎన్నికలు పెడితే కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు !
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ఆ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిందని శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
- నామినేటెడ్ ద్వారా కాంగ్రెస్కార్యకర్తలకు పదవులు కట్టబెట్టాలి అనుకోవడం అప్రజాస్వామికం
- దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు పెట్టండి : నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ఆ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిందని శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. పంటలకు పెట్టుబడి సాయం అందించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ దయగా భావిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల సంఖ్యలో క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండటంతో రైతు కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలు పెడితే ఓటమి ఖాయమనే భయంతోనే నామినేటెడ్ పదవుల వైపు మొగ్గు చూపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్‌కు దమ్ముంటే వెంటనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులే రాజులు
కేసీఆర్ పాలనలో రైతులు రాజులా బతికారని, కాంగ్రెస్ పాలనలో ఆ రైతులు తమ వైభవం కోల్పోయారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు అడుగకుండానే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, 100% పంటల కొనుగోలు, సాగునీరు, రైతు వేదికలు నిర్మించి వ్యవసాయానికి ఇతోధికంగా కేసీఆర్ సాయం అందించారని గుర్తుచేశారు. రైతుల బంగారు భవిష్యత్తకు కేసీఆర్ పునాదులు వేస్తే, కాంగ్రెస్ రెండున్నరేండ్లలోనే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

