హైదరాబాద్ : తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోంది అని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుంది అని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు.
తెలంగాణ మకుటం,సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు.స్వరాష్ట్రంలో సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ,దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోంది 1/2
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2021