హైదరాబాద్: బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సింగరేణి సమ్మె మూడోరోజుకు చేరింది. సిగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మె విజయవంతమైంది.
రామగుండంలో బొగ్గు క్షేత్రాల్లో మూడోరోజు సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. రీజియన్లోని 6 భూగర్భ, 4 ఉపరితల గనుల్లో కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి.