హైదరాబాద్ మే 15 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న(ఆదివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నామని సీఎండీ ఎన్ బలరామ్ గురువారం వెల్లడించారు. 100 కంపెనీలు పాల్గొని మూడు వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మందమర్రి, రామగుండం-1, భూపాలపల్లి ఏరియాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలోని మిగిలిన ఏరియాల్లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.