ఆయా విభాగాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ వేతనాల్లోంచి ఒకరోజు మూలవేతనం కుదింపు ద్వారా సీఎం సహాయనిధికి ఇవ్వాలని పేర్కొన్నారు.
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి సింగరేణి రూ. 10.25 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. గురువారం ఇందుకు సంబంధించిన చెక్కును సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో సింగరేణి సీఎండీ బలరాం, ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రాస్ అందజేశారు. సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగుల ఒక్కరోజు బేసిక్ వేతనాన్ని అందించారు. సీపీఐ నేత కొత్తగూడెం ఎమ్మెల్యే రూ. 2.50 లక్షల విరాళం చెక్కును సీఎం రేవంత్‌కు అందించారు.