హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ వి. సీతారామయ్య అధ్యక్షతన జరిగిన 48వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు.
సింగరేణి సంస్థ ఉత్పత్తిలో ఆదర్శప్రాయంగా ఉందని, రక్షణలోనూ ప్రమాద రహిత కంపెనీగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని బలరాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ రీజియన్ 2 ఎన్ నాగేశ్వరరావు, సంస్థ డైరెక్టర్లు డీ సత్యనారాయణ (ఈఅండ్ఎం) ఎన్వీ కే శ్రీనివాస్ (ఆపరేషన్స్ అండ్ పర్సనల్), జీ వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) రక్షణ చర్యలపై ప్రసంగించారు.