హైదరాబాద్: పెంచిన టికెట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కాక్రమానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మెహిదీపట్నం నుంచి బస్ భవన్‌కు ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. తన పక్కన కూర్చున ఓ విద్యార్థి బస్ పాస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ అయిందని విమర్శించారు. బస్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.
22 నెలల్లోనే ప్రభుత్వం బస్ చార్జీలను ఐదుసార్లు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన టికెట్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలపై రోజుకు రూ.20 భారం పడుతుందని చెప్పారు. ప్రతి నెల ఆర్టీసీకి ప్రభుత్వం మహాలక్ష్మి డబ్బులు చెల్లించడం లేదని, సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చి ఆర్టీసీ డ్రైవర్లను తొగించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని ఈ వినూత్న కార్యాక్రమాన్ని చేపట్టామన్నారు. హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Live: మెహిదీపట్నం నుండి బస్ భవన్ కు బస్సులో బయల్దేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/JU2WWIYxV5
— BRS Party (@BRSparty) October 9, 2025