హైదరాబాద్, నవంబర్7 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలోనే కులగణనను చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి రిజర్వేషన్లు కల్పించాలని కోరా రు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఇంకా ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని కృష్ణయ్య నిలదీశారు. జనాభా లెకల్లో బీసీ కులాల లెకలు సేకరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.