హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపలు, రొయ్యపిల్లల పెంపకం బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, సెర్ప్ సీఈవో దివ్యతో కలిసి మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో రూ.122 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కోదండరామ్, అజారుద్దీన్ పేర్లకు ఏఐసీసీ ఆమోదం
హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ పేర్లను నామినేట్ చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.