ఆ హత్యలకు కారణం పోలీసు లాలూచీ
పోక్సో కేసు నిందితుడు ఆరుగురుని హత్య చేసిన ఘటనలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు.
- పోక్సో కేసు పెట్టినా సీరియస్‌గా తీసుకోని షాబాద్ పోలీసులు
- నిందితుడిని స్టేషన్‌కూ పిలిపించలే!
- బెయిల్ పొందేవరకూ సహకారం
- నిందితుడి నుంచి 2 లక్షలు లంచం తీసుకున్నారంటున్న బాధిత కుటుంబం
- బెయిల్‌పై ఆందోళన వ్యక్తంచేయగా.. వెటకారంగా మాట్లాడారని ఆరోపణ
హైదరాబాద్ సిటీబ్యూరో/షాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడు ఆరుగురుని హత్య చేసిన ఘటనలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ పొందేందుకు కావాల్సిన సమయం ఇచ్చేందుకు పోలీసులు 2 లక్షల లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పోక్సో కేసులో తక్కువ తీవ్రతతో ఏడేండ్లలోపు శిక్షలు పడే(78, 351(1) బీఆఎన్ఎస్, 11, రెడ్‌విత్ 12 పోక్సో యాక్ట్ 2012) సెక్షన్లతో కేసులు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
కనీసం నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఏం జరిగిందనే వి షయాన్ని కూడా ఆరా తీయలేదనే విమర్శలు వస్తున్నాయి. నిందితుడి నుంచి ప్రాణభయం ఉందంటూ బాధితులు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఈ హత్యలకు పరోక్షంగా పోలీసులు కూడా బాధ్యులేనం టూ ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ షాబాద్‌లో ప్రధాన రహదారిపై బాధిత బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వలేదని, నిందితుడిని కూడా పట్టుకోలేదని అంటున్నారు. పోక్సో కేసు నమోదైన తరువాత నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని ఉన్నతాధికారులు ప్రశ్నించకపోవడంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచంలో కొంత ఉన్నతాధికారులకు పంపించడంతోనే ఈ కేసులో నిందితుడికి సంబంధించిన విషయాన్ని అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏడాదిగా వేధిస్తున్నాడని చెప్పినా..
బాధితురాలిని నిందితుడు ఏడాదిగా వేధిస్తున్నాడు. ఆమె ఇంటి పక్కనే ఉంటూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టాడు. బాలిక ఏం చేస్తున్నది, ఎప్పుడు బయటకు వెళ్తున్నదనే విషయాలను గమనించేవాడు. మీ తండ్రిని చంపినట్టే నీ కుటుంబాన్ని హతమారుస్తానంటూ బెదిరించాడు. బాధితులు ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కేసుతీవ్రతను గుర్తించి నిందితుడిని కనీసం మందలించాలనే ఆలోచన కూడా చేయలేదు. రాజ్‌కుమార్ బెయిల్ తీసుకొని గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లి భయాందోళన వ్యక్తం చేస్తే.. పోలీసులు వెటకారంగా నవ్వుతూ మాట్లాడారని, కేసును చాలా లైట్‌గా తీసుకున్నారనే విమర్శలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

