గత ఏడాది పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుజిత్. ప్రస్తుతం ఆయన లైనప్‌లో ‘ఓజీ’ సీక్వెల్‌తో పాటు నానితో ‘బ్లడీ రోమియో’ సినిమా కూడా ఉంది. ‘ఓజీ-2’ సెప్టెంబర్‌లో ప్రారంభంకానుందనే వార్తలు కూడా వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఓజీ-2’ సినిమాకు బ్రేక్‌నిచ్చి ‘బ్లడీ రోమియో’ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు సుజిత్ సిద్ధమవుతున్నారని తెలిసింది.
అక్టోబర్‌లో ‘బ్లడీ రోమియో’ సెట్స్‌పైకి వెళ్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ‘బ్లడీ రోమియో’తో పాటు ‘బ్లాస్ట్’ ఫేమ్ సుభాష్ కె రాజ్ డైరెక్షన్లో నాని ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.