పెద్దమందడి, మార్చి 26 : వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి 15 మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.