Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పని చేస్తున్న కార్మికుల్లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ రావు పారిపోయాడు. ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఇంటి యజమాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.