Hanumakonda Collectorate | ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
ఇర్ఫాన్ సోహైల్ అనే వ్యక్తి హనుమకొండ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కలెక్టరేట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా సిబ్బందిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టరేట్లోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సోహైల్‌కు ఉన్నత స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ సోహైల్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అలాగే నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.