హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ ఎస్ఈఐ..హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం సచివాలంలో కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే మూడేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ జీసీసీ సెంటర్.. ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా రాష్ర్టాన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు దోహదం చేయనున్నదని మంత్రి ధీమా వ్యక్తంచేశారు.
ట్రూ గుడ్ నిధుల సేకరణ
హైదరాబాద్, అక్టోబర్ 15: రాష్ర్టానికి చెందిన మిల్లెట్తో స్నాక్స్ తయారు చేస్తున్న ట్రూ గుడ్ తాజాగా మరో 9 మిలియన్ డాలర్లు(రూ.75 కోట్లకు పైమాటే) నిధులను సమీకరించింది. ఓక్స్ అసెస్ మేనేజ్మెంట్ సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, డిస్ట్రిబ్యూషన్లను పెంచుకోవడానికి వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.