హైదరాబాద్, మార్చి 28 (నమస్తేతెలంగాణ) : వానకాలం సీజన్‌కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్‌లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ వానకాలం సీజన్లో 66.80 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాల్లో పత్తి, 9 లక్షల ఎకరాల్లో సోయా సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.