సభకు రాకుండా దావత్ల ఎర
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు.
- అడుగడుగునా అడ్డంకులు
- అయినా లెక్కచేయని ప్రజలు
- బీఆర్ఎస్ సభకు పోటెత్తిన జనం
- గులాబీ దళపతికి బ్రహ్మరథం
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు. ఆదివారం నాందేడ్‌లోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలను రాకుండా అక్కడి బీజేపీ నాయకులు అడ్డుకొన్నారు. నాందేడ్ జిల్లాలోని పలు తాలూకా కేంద్రాలు, పంచాయత్‌లు, కంధార్, లోహ పట్టణాల్లో యువతకు పెద్ద ఎత్తున దావత్‌లు ఇచ్చారు. గ్రామాల్లో గొర్లు, మేకలు కోసి భోజనాలు పెట్టారు. వ్యవసాయ క్షేత్రాల్లో అధికారులు వస్తున్నారని ప్రచారం చేసి, రైతులను సభకు రాకుండా కుట్ర పన్నారు. గ్రామాల్లో ఆటో అడ్డాల దగ్గర యువకులను పెట్టి ఎవరూ సమావేశానికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి విఘ్నాలను ఛేదించుకొని రైతులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో లోహ బహిరంగ సభా ప్రాంగణానికి చేరువ కాగానే.. అక్కడి నుంచి దారి మళ్లించారు. ఇలాంటి అనేక కుట్రలను ఛేదించుకొంటూ.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదిస్తూ ప్రజలు బీఆర్ఎస్ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. కొందరు కుటుంబ సమే తంగా స్వచ్ఛందంగా ద్విచక్రవాహనాలపై సభాస్థలికి చేరుకొన్నారు. ముఖ్యంగా రైతులు పెద్దసంఖ్యలో వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. యువత సైతం గుంపులు, గుం పులుగా బీఆర్ఎస్ పార్టీ సభకు హాజ రయ్యారు. సభా ప్రాంగణంలో ‘దేశ్ కీ నేత కైసే హో… కేసీఆర్ కీ జైసే హో’ అంటూ గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు మరాఠ్వాడ బ్రహ్మరథం పట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

