హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తలపెట్టిన చలో ఇందిరాపార్క్‌ను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పిలుపునిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లంతా ఇందిరాపార్క్‌కు తరలిరావాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశంలు కోరారు. సీపీఎస్ రద్దు, బడ్జెట్లో విద్యకు 15% నిధుల కేటాయింపు, హెల్త్కార్డులివ్వాలన్న డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వారు వెల్లడించారు.