హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల జాబితాలను, బ్యాలెట్ బ్యాక్సులు సిద్ధం చేసి, సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఎస్ఈసీ.. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని మంగళవారం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించారు.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెం ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, కౌంటింగ్ సిబ్బందికి బుధవారం శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్లు (ఎంవోటీ)లకు శిక్షణ ముగిసిందని వెల్లడించారు.