హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట రు జాబితాపై ఎస్ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిణి నోటిఫికేషన్ జారీచేశారు.
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్‌ను తయారుచేసి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురించాలని మంగళవారం కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. రాజ్యాంగంలో ని ఆర్టికల్ 243-కే కింద తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 10, 11 ప్రకా రం ఈ షెడ్యూల్ విడుదల చేశారు. 2025 జూలై ఒకటిని అర్హత తేదీగా తీసుకొని అసెంబ్లీ నియోజకవర్గాల ఫొటో ఓటర్ల జాబితాల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపారు.
28న పంచాయతీలు, వార్డులవారీగా ఓటరు జాబితాప్రదర్శన, 28న జిల్లాస్థాయి, 29న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్న ట్టు పేర్కొన్నారు. 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. హైదరాబా ద్, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీలు), డీపీవోలు, ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆగస్టు 28: గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో వార్డువారీగా ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్ డ్రాఫ్ట్ ప్రదర్శన
ఆగస్టు 29: జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారుల సమావేశం
ఆగస్టు 30: మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల సమావేశం
ఆగస్టు 28 నుంచి 30 వరకు: రూరల్ అసెంబ్లీ ఓటర్లను వార్డులవారీగా పునర్వ్యవస్థీకరణపై అభ్యంతరాల స్వీకరణ
ఆగస్టు 31: జిల్లా పంచాయతీ అధికారులతో అభ్యంతరాల పరిషారం
సెప్టెంబర్ 2: గ్రామ పంచాయతీల వార్డులవారీ ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్ తుది జాబితా ప్రకటన