మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 20:17:29

తల్లిదండ్రుల సమ్మతి ఉంటనే పాఠశాలకు అనుమతి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తల్లిదండ్రుల సమ్మతి ఉంటనే పాఠశాలకు అనుమతి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనమీ లేదని, తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభంకానున్న నేపథ్యంలో పాఠశాలలకు పిల్లలను పంపేందుకు ఇప్పటికే 60శాతం విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మతించారని మంత్రి తెలిపారు. సుదీర్ఘ సమయం తరువాత విద్యాసంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో బుధవారం నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో జిల్లావిద్యాశాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారులతో వేర్వేరుగా ఆమె సమావేశమయ్యారు.

విద్యాసంస్థల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో పిల్లలను పాఠశాలలకు పంపాలన్న భావన కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యాసంస్థల నిర్వహణకు కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం, ఇతర సామగ్రి తాజావి వినియోగించాలన్నారు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలని, తరగతి గదులను నిత్యం శానిటైజ్‌ చేయాలని చెప్పారు. సిలబస్‌ పూర్తిచేయడంపై దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo