హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి ఎం శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.