NIMS | హైదరాబాద్ : గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కోలుకుంటున్నదని ప్రభుత్వం తెలిపింది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థిని నడుము భాగానికి తీవ్రగాయాలయ్యాయి.
గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స ఇప్పించారు. మెరుగైన వైద్యం నిమిత్తం వరంగల్ ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించారు. కార్తీకకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడారు. వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నట్టు పేర్కొన్నారు. నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం కార్తీకకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ఐసీయూలో ఉన్నదని, కోలుకుంటున్నదని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC | రాఖీ పండుగ వేళ మరో బంపరాఫర్.. కార్గో ద్వారా 24 గంటల్లో రాఖీలు, స్వీట్లు బట్వాడ
MLC Kavitha | రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు కీలక వాదనలు