హైదరాబాద్ జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం.. ములుగులో సీతక్క రాజ్యాంగం నడుస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మంత్రి సీతక్క ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజాధనంతో కడుతున్న ఇండ్లను కాంగ్రెస్ నాయకులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పథకాల అమలులో మంత్రి అనుచరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాలపై అక్కడి కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు.