Vande Bharat | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘కొత్త వందేభారత్ రైలు భాగ్యలక్ష్మి అమ్మవారి నగరం నుంచి వేంకటేశ్వరస్వామి ఉండే తిరుపతి నగరాన్ని అనుసంధానం చేస్తున్నది’ అంటూ ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటున్నారు. వందేభారత్ టికెట్ ధరలపై సోషల్‌మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి.
‘సికింద్రాబాద్ నుంచి గుంటూరు ఎంప్లాయిస్ ట్రైన్ సమయం 3:53 గంటలు, టికెట్ ధర: రూ.480.. అదే వందేభారత్ రైలులో వెళ్తే పట్టే సమయం 3:45గంటలు, టికెట్ ధర రూ. 865.#అబ్బే గిట్టుబాటు కాదమ్మా నాకైతే’ అంటూ ఓ నెటిజన్ వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వందేభారత్ టికెట్ బుక్ చేసుకొందామంటే భాగ్యలక్ష్మి టెంపుల్ రైల్వేస్టేషన్ కనిపించడం లేదంటూ ఒకరు మోదీకి చురకలంటించారు. వందేభారత్ రైలును మోదీ ఇప్పటికే పదిసార్లు ప్రారంభించడంపైనా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘దాన్ని వందేభారత్ రైలు అని ఎందుకు అన్నా రో తెలుసా? దాన్ని వందసార్లు ప్రారంభిస్తారు కాబట్టి.’ అంటూ షర్మిళ ైస్టెల్లో ఓ నెటిజన్ సెటైర్ వేశారు.